అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా రవితేజ నటించిన ఈగల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచేసింది… ఇప్పుడు ఇప్పుడు టిల్లు స్క్వేర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలోనూ సైరెన్ అంటూ హిట్టు కొట్టేసింది. ఇక ఇప్పుడు అనుపమ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ సెట్స్ మీదున్నట్టుగా కనిపించడం లేదు. అనుపమ మాత్రం నెట్టింట్లో ఫుల్ బిజీగా ఉంటోంది. అనుపమ తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు మారిషస్ వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
ఇదిలా ఉండగా.. తాజాగా అనుపమ ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చింది.. అదేంటంటే..అందులో బేబీ హిప్పోస్ కనిపిస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి బహుమతిగా ఇస్తే నేను మీకు సొంతం అవుతా అంటూ అనుపమ ఆఫర్ ఇచ్చింది. అంటే వాటిని గిఫ్టుగా ఇస్తే పెళ్లి చేసుకుంటాను అని ఇలా హింట్ ఇచ్చేసింది.. నితిన్ ఇస్క్ సినిమాలో నిత్యా మీనన్ అన్నట్లు ఈ అమ్మడు కూడా అది ఇస్తే పెళ్లి చేసుకుంటాను చెప్పింది..
ఇక అనుపమ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పింది.. అనుపమ ఈ మధ్య తన అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టిన సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఆమె అభిమానులు తెగ హర్ట్ అయ్యారు. రెచ్చి పోయి నటించిన తీరు, ముద్దు సీన్లలో ఆమెను చూసి ఫ్యాన్స్ నిరాశ చెందారు… ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది..