NTV Telugu Site icon

Free Ration: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బియ్యం, గోధుమలతో పాటు పంచదార

Ration Card

Ration Card

Free Ration: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉచిత రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యంతో పాటు చక్కెరను ఉచితంగా అందజేస్తామని ప్రకటించినా, కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. సెప్టెంబర్‌లో 12, ​​13 తేదీల్లో ఉచిత రేషన్‌ పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డు హోల్డర్లకు కూడా ఈసారి మూడు నెలల షుగర్ ఉచితంగా లభిస్తుంది. ఈ మేరకు లక్నో డీఎస్‌వో విజయ్‌ ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. అంత్యోదయ కార్డుదారులకు కూడా జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కిలో చక్కెర రూ.18 చొప్పున అందుతుంది.

Read Also:Justin Trudeau: పాడైపోయిన డొక్కు విమానం.. ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని

ప్రస్తుతం ఉచిత రేషన్ పథకం కింద అంత్యోదయ కార్డుదారులకు 21 కిలోల బియ్యంతో పాటు 14 కిలోల గోధుమలు ఉచితంగా లభిస్తున్నాయి. అలాగే గృహకార్డుదారులకు యూనిట్‌కు ఐదు కిలోలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అర్హులైన కుటుంబాలతో పాటు అంత్యోదయ కార్డు హోల్డర్లు ప్రభుత్వ రేషన్ షాపుల్లో ఉచిత రేషన్ పొందుతారు. షాజహాన్‌పూర్ జిల్లాలో సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 23 వరకు ఉచిత రేషన్ అందుబాటులో ఉంటుంది. రేషన్ డీలర్లకు మంచి, పూర్తి రేషన్ అందించాలని జిల్లా సరఫరా కార్యాలయం ఆదేశించింది. ఈసారి అంత్యోదయ కార్డు ఉన్నవారికి ఒకేసారి 3 నెలల చక్కెర లభిస్తుంది. ఈసారి ఆంత్యోదయ కార్డుదారులకు చక్కెర పంపిణీని కార్డుకు కిలో రూ.18 చొప్పున మూడు కిలోల లెక్క జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు పంపిణీ చేయనున్నారు. ఎవరైనా రేషన్ డీలర్లు డబ్బులు డిమాండ్‌ చేసినా, ఫిర్యాదులు వచ్చినా అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లక్నోలో 37841 అంత్యోదయ కార్డు హోల్డర్లు ఉన్నారు. గృహ కార్డ్ హోల్డర్ల సంఖ్య 534159.

Read Also:Mayapetika: సెప్టెంబ‌ర్ 15 నుంచి ‘మాయా పేటిక’… ఆహాలో స్ట్రీమింగ్