Site icon NTV Telugu

Antony Blinken: గ్రీన్‌ల్యాండ్‌ విలీనం జరిగే ఛాన్స్ లేదు.. ట్రంప్‌ మాటలు పట్టించుకోవద్దు..!

Antony

Antony

Antony Blinken: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటానన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మాటలను పట్టించుకొని టైమ్‌ వేస్టు చేసుకోవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. అసలు అది జరిగే పని కాదన్నారు. తమ మిత్ర దేశాలతో కలిసి అమెరికా పని చేస్తుందన్నారు. వాటితో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనుందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ఇదే కోరుకుటున్నారని వెల్లడించారు. మిత్ర దేశాలను దూరం చేసుకొనే పనులు తాము చేయం’ అని అతడు తెలిపాడు. ఇక, బ్లింకెన్ మాట్లాడుతున్న సమయంలో ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జియోన్‌ నోయల్‌ బార్రోట్‌ కూడా అక్కడే ఉన్నారు. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని హెచ్చరించారు.

Read Also: Tollywood : ‘ఏఐ’ తో పని కానిచ్చేస్తోన్న టాలీవుడ్ దర్శకులు

ఇక, ఎన్నికల్లో విజయం ధ్రువీకరణ జరిగిన తర్వాత ఫ్లోరెడాలో అమెరికాకు కాబోయే అధ్యక్షుు డొనాల్డ్ ట్రంప్‌ విలేకర్లతో ఇష్టాగోష్టీలో మాట్లాడుతూ.. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే అంశాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం సైన్యాన్ని కూడా వినియోగించే ఛాన్స్ ఉందని పరోక్షంగా వ్యాఖ్యనించారు. ఈనెల 20న ట్రంప్‌ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన హయాంలో విదేశాంగ విధానంలో పెను మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version