టాప్ మోస్ట్ సినిమాల్లో పాత్రలకు వాయిస్ లే కాదు, పాటలకు ఏఐలను వాడేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కల్కిలో ఫేస్ లకు ఏఐను వాడిన దర్శకులు రానురాను సింగర్స్ గొంతులకు ఏఐలను వాడుతున్నారు. కల్కి చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర క్రిష్ణుడి శాపానికి గురి అయినప్పుడు ఆ టైమ్ లోని అమితాబ్ ను చూపించడానికి ఏఐని వాడి శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు బిగ్ బి లుక్ ను ఫైట్స్
లోను ఎంతో చక్కగా వినియోగించుకున్నారు.అది సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది.
Also Read : Game Chanager : టికెట్స్ బుకింగ్ లో జోరు చూపిస్తోన్న గేమ్ ఛేంజర్
తాజాగా గేమ్ ఛేంజర్ కు ఇలాంటి ప్రయోగమే చేశారట. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాక మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పాటల విషయానికి వస్తే జరగండి పాటకు విశేష ఆదరణ లభించింది. ఈ పాట ఇంతలా రావడానికి రీజన్ ఏఐ అంటూ తమన్ సీక్రెట్ రివీల్ చేశాడు. ఇదే తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో దలేరి మెహందీ బాద్ షా లో బంతిపుల జానకి సాంగ్ పాడించాడు. అయితే అప్పటి ఎనర్జీ ఇప్పుడు దలేర్ లో లేకపోవడంతోనే ఆ వాయిస్ కోసం ఏఐ సాయం తీసుకోవల్సి వచ్చిందట. దలేర్ మొదట పాడించినప్పుడు తన గొంతులో పాటకు బూస్టింగ్ ఇవ్వలేకపోయాడని దీంతో హైదరాబాద్ కు చెందిన హనుమాన్ అనే సింగర్ తో ఇదే పాట పాడించి, ఏఐలో వేసి దలేర్ మెహందీ పాడినట్లు రీ క్రియేట్ చేశారట. కానీ అసలు పాట పాడింది సింగర్ హన్‌మాన్. అయితే ఈ ఏఐ సాయం ఇలా వాయిస్ లు, పాటలకేనా, లేక రాబోయో రోజుల్లో హీరోలు లేకపోయినా డూప్ లను పెట్టి ఇలా ఏఐలతో పనులు కానిచ్చేస్తారా చూడాలి.