Antarvedi: అంతర్వేది రథ శకలాల నిమజ్జనం నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Antarvedi: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దగ్ధమైన పాత రథం శకలాల నిమజ్జన కార్యక్రమాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇవాళ నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిమజ్జనాన్ని నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. శాస్త్రోక్త విధానాలు, ఆగమ నియమాల ప్రకారం మరింత చర్చించి, సరైన ముహూర్తంలో అత్యంత శాస్త్రబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
Read Also: Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
Also Read
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
అయితే, 2020 సెప్టెంబర్ 5న స్వామివారి కళ్యాణోత్సవ రథం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా, దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాత రథం శకలాలను ఆలయ ప్రాంగణంలో అలాగే ఉంచడం అరిష్ట సూచకమని, ఆగమ పండితులు, ఆలయ అర్చకులు సూచించడంతో, రథ శిథిలాలను నిమజ్జనం చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, దగ్ధమైన రథం స్థానంలో దేవస్థానం కొత్త రథాన్ని ఏర్పాటు చేసింది. పాత రథ శకలాల నిమజ్జనంపై దేవాదాయ శాఖ కార్యాచరణ ప్రకటించినా, ఆగమ నియమాలు, ముహూర్తాలపై విస్తృత చర్చలు జరిపిన అనంతరం, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిమజ్జనాన్ని మరో ముహూర్తానికి వాయిదా వేశారు.
ఇక, నిమజ్జనానికి ముందు రథ శకలాలకు ఉదయం 7.30 గంటల నుంచి శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, వాస్తుపూజ, పంచామృత ద్రవ్యాలతో ప్రోక్షణ, వాస్తు హోమం, అగ్నికరణ, పూర్ణాహుతి తదితర ఆగమ సంప్రదాయ శుద్ధి క్రతువులు నిర్వహించారు.
నిమజ్జన ప్రక్రియ ఎలా జరగాల్సిందంటే
కార్యక్రమం ప్రకారం రథ శకలాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి, అన్నాచెల్లెమ్మ గట్టు వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ఆగమ సంప్రదాయం ప్రకారం కర్పూరంతో భస్మపటనం (దగ్ధ శకలాల దహనం) నిర్వహించి, చల్లారిన తరువాత ఆ భస్మాన్ని బోటు ద్వారా నదీ మధ్యకు తీసుకెళ్లి నదిలో కలిపేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై దేవస్థానం, దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ “భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, పూర్తి స్థాయి ఆగమ నియమాలు, శాస్త్రోక్త ముహూర్తం ప్రకారం రథ శకలాల నిమజ్జనాన్ని నిర్వహిస్తాం” అని తెలిపారు. కానీ, అనివార్య కారణాలతో నిమజ్జనాన్ని ఇవాళ నిలిపివేశారు అధికారులు, తదుపరి తేదీ, ముహూర్తాన్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!