అసలే గుంటూరు రాజకీయాలకు వేదిక. హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. తాజాగా గుంటూరులో మరో విగ్రహ వివాదం రాజుకుంటోంది. పుల్లరి పోరాటయోధుడు స్వర్గీయ కన్నెగంటి హనుమంతు విగ్రహాన్ని కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారంటూ వదంతులు రేగాయి. ఈ నేపథ్యంలో విగ్రహ కమిటీ స్పందించింది. కార్పొరేషన్ అధికారులు రాజకీయ పార్టీల జోక్యంతో, కార్పొరేషన్ పాలకవర్గ వత్తిల్లతో కన్నెగంటి విగ్రహానికి హాని తలపెడుతున్నారంటూ ఆందోళన సిద్ధమవుతున్నారు విగ్రహ కమిటీ సభ్యులు.
Read Also:Bandi Sanjay Bail Live: బండి సంజయ్ కి బెయిల్.. కండిషన్స్ అప్లై
ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పాలకవర్గం కూడా స్పందించింది. రాజకీయాల కోసం విగ్రహాలను వాడుకోవద్దని, గుంటూరు అభివృద్ధిలో భాగంగా విగ్రహాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. వదంతులపై తీవ్రంగా స్పందించింది కార్పొరేషన్ పాలకవర్గం.రాజకీయ కక్షలు రేపటానికి కొన్ని వర్గాలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు గుంటూరు మేయర్ కావటి మనోహర్.
ఇప్పటివరకు ఆలనా పాలనా లేకుండా పడి ఉన్న విగ్రహాలను అందంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. రాజకీయ పార్టీల స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టవద్దని స్పష్టం చేశారు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఈ నేపథ్యంలో కన్నెగంటి విగ్రహం వద్ద విగ్రహ కమిటీ ఆందోళనకు సిద్ధమవుతోంది. కన్నెగంటి విగ్రహ కమిటీ చైర్మన్ గా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న నేపథ్యంలో రాజకీయ వివాదాలకు ఈ అంశం వేదిక అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. పోలీసులు శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టారు.
Read Also: CNG Rates: 10 శాతం వరకు తగ్గనున్న సీఎన్‌జీ ధరలు.. ధర విధానంలో మార్పుకు కేంద్రం ఆమోదం..