జస్ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ 2023లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లనే తొలి బంతికే వికెట్ తీశాడు. దీంతో ప్రపంచ కప్ చరిత్రలో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
Read Also: World Cup 2023: గిల్ అద్భుత షాట్.. కోహ్లీ రియాక్షన్ చూశారా..!
బుమ్రా తొలి బంతికే ఎల్‌బీడబ్ల్యూ ద్వారా శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సాంకను పెవిలియన్ బాట పట్టించాడు. బుమ్రా వేసిన బంతిని మిడిల్ స్టంప్ లైన్‌లో వేయగా.. అది ఆఫ్ స్టంప్ నుండి స్వింగ్ అయి నిస్సాంక తొడ ప్యాడ్‌కు తగిలింది. దీంతో అంపైర్ వేలి ఎత్తి ఔట్‌గా ప్రకటించాడు. కానీ నిస్సాంక రివ్యూ తీసుకోవడంతో థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు.
Read Also: Somireddy: చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టులోని మొత్తం ముగ్గురు బ్యాట్స్‌మెన్లు సెంచరీలను మిస్ చేసుకున్నారు. ఇందులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 88 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.