ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయ యువకుడిని అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు శనివారం తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28) ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) సిబ్బంది అమన్‌దీప్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, నిజ్జర్ హత్యకు కుట్ర అభియోగాలు మోపారు. 22 ఏళ్ల అనుదీప్ సింగ్ అబాట్స్‌ఫోర్డ్‌లలో నివసిస్తున్నాడు. ఆయుధాలకు సంబంధించిన ఆరోపణలపై ఇప్పటికే అతడు అంటారియోలో కస్టడీలో ఉన్నట్లు IHIT తెలిపింది. అరెస్టయిన మరో భారతీయుడు, నిందితులను శిక్షించేందుకు కట్టుబడి ఉన్నామని కెనడా పోలీసులు తెలిపారు.
READ MORE: Heavy Rain Forecast: ఏపీకి భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో.. రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!
ఎవరీ నిజ్జర్.. అసలు అతడి కథేంటి.. నిజ్జర్ ఖలిస్థాన్ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్. అతను గత కొన్నేళ్లుగా కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడ నుంచి భారత్ కి వ్యతిరేకంగా ఖలిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచుతున్నాడు. 2010లో పాటియాలాలోని ఓ ఆలయం వెలుపల జరిగిన బాంబు పేలుళ్లలో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హింసను ప్రేరేపించడం, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి పలు కేసుల్లో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. భారతదేశ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతనిపై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. నిజ్జర్ గత ఏడాది కాలంలో భారత దర్యాప్తు సంస్థలకు మరింత పెద్ద తలనొప్పిగా మారాడు. ఈ తరుణంలో కెనడాలోని సర్రేలో గురుద్వారా వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ ను కాల్చి చంపారు. దీంతో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందని కెనడా విశ్వసిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత్ హతమార్చిందని పలు సందర్భాల్లో ఆరోపించారు. నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ఆరోపణలు చేయడంతో ఇండో-కెనడియన్ సంబంధాలు క్షీణించాయి.