NTV Telugu Site icon

Physical Harassment: కోల్‌కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు

Physical Harassment

Physical Harassment

కోల్‌కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఐసీహెచ్)లోని పిల్లల వార్డులో తాను నిద్రిస్తున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల తనయ్‌పాల్‌గా గుర్తించారు.

Horrifying incident: చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..

నివేదిక ప్రకారం.. తనయ్ పాల్ పిల్లల వార్డుకు వచ్చి మహిళను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. ఆమె వస్త్రాలను కూడా విప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్‌లో రికార్డు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కోల్‌కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా.. నిందితుడి ఫోన్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఆ తరువాత.. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. పోలీసు కస్టడీకి ఇచ్చింది.

Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్‌తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..

మరోవైపు.. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన అత్యాచారం-హత్య కేసుపై బెంగాల్ లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ కేసులో సిబిఐ ఆదివారం మెడికల్ ఇనిస్టిట్యూట్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్‌లను కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో ఘోష్‌పై సాక్ష్యాలను తారుమారు చేసినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అవినీతి కేసులో ఘోష్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మండల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.