NZ vs PAK: వరల్డ్ కప్లో మరో భారీ స్కోరు.. పాక్పై కివీస్ వీరబాదుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NZ vs PAK: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టు పాకిస్తాన్పై వీరబాదుడు బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్లో రెండో అత్యధిక స్కోరు ఇదే. కివీస్ బ్యాటింగ్లో ఓపెనర్ల మంచిగా రాణించారు. రచిన్ రవీంద్ర (108) మరో సెంచరీ నమోదు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. మరో ఓపెనర్ డెవిన్ కాన్వే 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 95 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర, విలియమ్సన్ మధ్య భారీ భాగస్వామ్యం నెలకొంది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన డేరిల్ మిచెల్ 29, మార్క్ చాప్మాన్ 39, గ్లేన్ ఫిలిప్స్ 41, మిచెల్ సాంథ్నర్ 26 పరుగులతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ వసీం 3 వికెట్లు తీశాడు. హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, హారిస్ రౌఫ్ తలో వికెట్ పడగొట్టారు. అత్యధికంగా పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 10 ఓవర్లు వేసి 90 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా సంపాదించలేదు. ఆ తర్వాత హారిస్ రౌఫ్ 10 ఓవర్లలో 85, హసన్ అలీ 82, మహ్మద్ వసీం 60, ఇఫ్తికర్ అహ్మద్ 8 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చారు. కివీస్ బ్యాటర్ల పరుగుల వరదను ఆపేందుకు పాకిస్తాన్ బౌలర్లు కష్టపడినప్పటికీ పరుగుల వర్షం కురిసింది.
Read Also: Kannappa: మంచు విష్ణు కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!