NTV Telugu Site icon

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. టెన్నిస్‌లో పతకం

Tennis

Tennis

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి సెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రెండో సెట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే అద్భుతంగా కమ్బ్యాక్ అయి చివరికి సూపర్ టై బ్రేక్‌లో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

Read Also: Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?

భారత జోడీ రోహన్ బోపన్న, రుతుజా భోసలే తొలి సెట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 6-2తో తైపీ జోడీ చేతిలో ఓడింది. ఆ తర్వాత భారత జోడి రెండో సెట్‌లో అద్భుతంగా పునరాగమనం చేసి.. తైపీ జోడీ అన్-షువో లియాంగ్, సుంగ్-హావో హువాంగ్‌లను 10-4తో ఓడించి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. సూపర్ టై బ్రేక్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసాలే 10-4తో అద్భుతంగా స్కోర్ చేయడం ద్వారా టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో చరిత్ర సృష్టించారు. దీంతో ఆసియా క్రీడలలో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు.

Read Also: IND vs ENG: ఇండియా-ఇంగ్లాండ్‌ వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డంకి..

19వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 9వ స్వర్ణం. ఈ స్వర్ణ పతకంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 13 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 35కి చేరుకుంది. ఏడో రోజు భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది.