బ్యాంకులో దొంగలు పడ్డారు.. కానీ బయటి వాళ్లు కాదు.. బ్యాంకు సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల చెన్నూర్ ఎస్ బీ ఐ బ్రాంచి 2 బ్యాంకు లో 402 మంది తాకట్టు పెట్టిన బంగారాన్ని క్యాషియర్ తస్కరించిన విషయం తెలిసిందే. ఆ మోసం మరవక ముందే మరో మోసం వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ లో ఎస్ బీ ఐ బ్యాంకు లో నాణ్యత లేని బంగారం తాకట్టు పెట్టి మొత్తం 12 మంది పేరిట సుమారు రూ .23 లక్షలు తీసుకున్నారు.
Also Read:Asia Cup 2025: మోస్తరు స్కోర్ చేసిన పాకిస్తాన్.. ఒమన్ చేధించేనా?
ఇటీవల బ్యాంక్ అంతర్గత ఆడిట్ లో బాగోతం బయట పడింది. అసలు బంగారంకు బదులుగా నాణ్యత లేని బంగారం భద్రపరచినట్లు గా గుర్తించారు. బంగారం పరిశీలించే వ్యక్తి పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ చెక్ చేసే వ్యక్తి (అప్రైజర్)తన 12 మంది మిత్రుల పేరిట తక్కువ ప్యూరిటీ కలిగిన బంగారం భద్రపరిచినట్లుగా నిర్ధారించారు అధికారులు. బ్యాంకుల్లో వరుస ఘటనలు చోటుచేసుకుంటుండడంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. తమ బంగారానికి, డబ్బుకు భద్రత కరువవుతుండడంతో అసహనం బ్యాంకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.