బాలీవుడ్ హీరో షాదీ కపూర్ సినీ కెరీర్ ఒక హిట్ మూడు ఫ్లాప్స్ అన్నట్టు సాగుతుంది. కబీర్ సింగ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు షాహిద్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019లో రిలీజై రూ. 370 కోట్లను కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత ఆ రేంజ్ కొట్టడానికి షాహిద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ప్రతి సారి నిరాశ ఎదురవుతుంది. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టి భారీ కలెక్షన్స్ రాబట్టాలని ఆశగా ఎదురుచుసిన షాహిద్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది.
Also Read : MAD Square : మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
షాహీద్ కపూర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దేవా. ఈ సినిమాలో షాహీద్ పోలీసాఫీసర్ పాత్రలో పూజా హెగ్డే జర్నలిస్టుగా కనిపించారు. దేవాకు మలయాళ స్టార్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జనవరి 31న థియేటర్లలోకి వచ్చింది. ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు షాహీద్. కాని సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. ముంబై పోలిస్ రీమేక్ గా వచ్చిన దేవా యావరేజ్ వద్దే ఆగిపోయింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అటు ఇటుగా రూ. 65 కోట్ల వద్ద ఆగింది. షాహిద్ నటించిన జెర్సీ ప్లాప్ కాగా, తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. కబీర్ సింగ్ రేంజ్ కొట్టాలని చూస్తున్న షాహిద్ ఖాతాలో మరో ప్లాప్ చేరింది.