NTV Telugu Site icon

KTR: కేటీఆర్ పై మరో కేసు నమోదు..

Ktr 1

Ktr 1

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా ర్యాలీ చేశారని అభియోగం మోపారు. అయితే నిన్న (గురువారం) ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. బయటికొచ్చిన తర్వాత ర్యాలీతో తెలంగాణ భవన్ కు వచ్చారు. అయితే అనధికారికంగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.

Read Also: Fauji : 1940 బ్యాక్ డ్రాప్ లో ఫౌజీ.. హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉంటుందట

మరోవైపు గురువారం ఏసీబీ విచారణ అనంతరం ఏసీబీ ఆఫీసు దగ్గర మాట్లాడుతుండగా డీసీపీ అడ్డుకున్నారు. రోడ్డుపై మాట్లాడొద్దని, పార్టీ ఆఫీసుకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాలని కేటీఆర్ కు డీసీపీ సూచించారు. ఈ క్రమంలో.. ఇక్కడ మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయమని కేటీఆర్ అన్నారు. అనంతరం.. తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

Read Also: itel ZENO 10: రూ. 6 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలా?.. ఈ మొబైల్ పై ఓ లుక్కేయండి!

Show comments