NTV Telugu Site icon

WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్..! ముఖ్యంగా వీడియోల కోసం

Whatsapp

Whatsapp

వాట్సాప్ లో వీడియోల కోసం అదిరిపోయే ఫీచర్ రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోని రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్ లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లో యాప్ లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్ కి మారినప్పుడు కూడా ఈ మోడ్ లో వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.

Read Also: Dil Raju : దిల్ రాజు కొడుకు బుడ్డోడే కానీ మాములు కాదయ్యా.. పక్కా హీరోనే..

ఇదిలా ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ తరహాలో వాట్సాప్‌ స్టేటస్‌లోనూ ప్రత్యేకమైన వ్యక్తులను ట్యాగ్‌ చేసే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని ఆండ్రాయిడ్‌ అథారిటీ నివేదించింది. iOS వాట్సాప్‌ బీటాలో ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. టెస్టింగ్‌ అనంతరం యూజర్ల కోసం విడుదల చేయనున్నారు. వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌ యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Yash Toxic: ఇదేందయ్యా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు?

వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్‌ WaBetainfo ప్రకారం.. వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ 2.24.7.19 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో కొత్తగా మినిమైజ్‌ బటన్‌ను తీసుకురానున్నట్లు తెలిసింది. ఫలితంగా వాట్సాప్‌ కాలింగ్ ఇంటర్‌ఫేస్‌ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది.