Anna Canteens: మరింత చేరువుగా ‘అన్నక్యాంటీన్స్’.. మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి.!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- 269కి పెరగనున్న క్యాంటీన్ల సంఖ్య
- ఇప్పటికే 207 క్యాంటీన్ల ద్వారా ప్రతీ రోజు 2.10 లక్షల మందికి భోజనం
- ఈ నెల 15న ధరణికోటలో అన్నక్యాంటీన్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Canteens: కార్మికులు, కూలీలు, గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రజా కూటమి ప్రభుత్వం తాజాగా మరికొన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. రూ.5లకే పేదలకు కడుపునిండా నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పిన సర్కార్ ఆ హామీని ఆచరణలో పెడుతోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా 3 క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రెండవ విడత అన్నక్యాంటీన్లను ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో ప్రారంభిస్తారు.
IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నక్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చాక పున: ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ప్రారంభించబోయే 62 క్యాంటీన్లతో ఈ సంఖ్య 269 కు పెరుగనుంది. రుచి, శుచితో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. క్యాంటీన్ల పున:ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా పేదలు 8.80 కోట్ల భోజనాలు చేశారు. ఒక్కో అన్న క్యాంటీన్లో సగటున రోజుకు 1,013 మంది చేసే భోజనాలకు రూ. 26,250 ఖర్చు అవుతోంది. 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. ఇందుకు రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతుండగా.. సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.243 కోట్లు వెచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ అన్న కాంటీన్ల సబ్సీడీకి ఏడాదికి రూ.58 కోట్లు వ్యయం అవ్వనుంది.
సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లుండి పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి ఒంటిగంటకు ధరణికోటకు చేరుకుంటారు. 1.30 గంటలకు అన్నాక్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి వారితో కలిసి భోజనం చేస్తారు. కార్యక్రమాన్ని ముగించుకుని 2.45 గంటలకు ఉండవల్లికి చేరుకుంటారు.
తాజావార్తలు
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?