Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలంగాణ యాస, సహజ నటనతో అలరించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంజిమామ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకున్నారు. నటుడిగా మారకముందు ఆయన ప్లంబర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, ఆర్ఎంపీ డాక్టర్‌గా రకరకాల పనులు చేశారు. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ, ఏ రంగంలోనూ ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోయారు. త్వరగా నిలదొక్కుకుని మంచి జీవితం పొందాలనే ఉద్దేశంతో, స్నేహితులతో కలిసి ఒక ‘ఈజీమనీ’ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టారు.
అయితే ఆ నిర్ణయం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దాదాపు రూ.23 లక్షలు కోల్పోవడంతో ఆయన జీవితం మరింత కష్టాల్లోకి నెట్టిందని పేర్కొన్నాడు. తొందరపడి సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను ఎవరూ ఎంచుకోవద్దని, అలాంటి వాటిని ప్రోత్సహించవద్దని ఆయన తన అనుభవంతో హెచ్చరించారు. ప్రస్తుతం నటనలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే, హైదరాబాద్ నగరం వేదికగా క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నానన్నాడు.
Also Read
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
కుటుంబ అవసరాల కోసం ప్రతి నెలా ఇంటికి రూ.50 వేలు పంపించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ పని చేయాల్సి వస్తోందని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించినప్పటికీ, కొందరు ప్రయాణికులు ఆయనను సులభంగా గుర్తుపడుతున్నారు. వరస కష్టాలు, ఆర్థిక భారాల మధ్య కొన్నిసార్లు హైదరాబాద్‌ను వదిలి సొంతూరికి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తోందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఒక ఎకరం పొలం, నాలుగు గేదెలు ఉంటే ప్రశాంతంగా.. హాయిగా బతికేయవచ్చని తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. తెరపై నవ్వులు పూయించే నటుడి వెనుక ఇంతటి ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసుకున్న ఆయన అభిమానులు నెట్టింట సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?