Site icon NTV Telugu

Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్!

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోతో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్’లో సినిమా విశేషాలను పంచుకున్న అనిల్ రావిపూడి, తన నిర్మాత సాహు గారపాటితో వేసుకున్న ఒక ఆసక్తికరమైన ‘బెట్’ గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం..

Also Read : Mana Shankara Varaprasad Garu : చిరంజీవి సినిమాకు ఇళయరాజా టెన్షన్? అనిల్ రావిపూడి క్లారిటీ!

ఈసారి తన నిర్మాత సాహు గారపాటి తో ఒక వెరైటీ ఛాలెంజ్ చేశారు. ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లపై ధీమాతో ఆయన ఈ ఇంట్రెస్టింగ్ బెట్ కట్టారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటే తానే స్వయంగా నిర్మాతకు కారు కొనిస్తానని అనిల్ రావిపూడి ప్రకటించారు. అయితే, ఒకవేళ సినిమా రేంజ్ పెరిగి 4 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటితే మాత్రం, దానికి ప్రతిఫలంగా నిర్మాత తనకు ఒక విల్లా కొనివ్వాలని కండిషన్ పెట్టారు. ఇది విన నెటిజన్లు ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, వసూళ్ల జోరు చూస్తుంటే, అనిల్ రావిపూడికి విల్లా రావడం ఖాయమని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version