Anil Kumar Yadav: జైలుకు వెళ్తే సింపతీ అంటున్నారు.. సింపతీ లేదు తొక్క, తోటకూర లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav: చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్తే సింపతీ వచ్చిందని మీడియాలో చెప్పుకుంటున్నారు.. కానీ, సింపతీ లేదు తొక్క, తోటకూర ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమ అంటేనే పౌరుషాల గడ్డ, నాయకుడంటే పౌరుషం ఉన్నవాన్ని ఎన్నుకోవాలి.. అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీరు మమ్మల్ని ఏమైనా అనొచ్చు, మేము గాని మిమ్మల్ని ఏదైనా అంటే బూతుల మంత్రులు అంటారు అని.. మీరు ఎట్లా తిట్టినా మాకు రోషం పౌరుషం ఉండకూడదు.. మేం గాని తిడితే మీకు రోషాలు పౌరుషాలు వస్తాయా..? అని దుయ్యబట్టారు.
Read Also: Dharmana Prasada Rao: 75 ఏళ్ల తర్వాత మార్పు వచ్చింది.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడింది..
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
చంద్రబాబు తప్పు చేశాడని లోపల వేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయిన వ్యక్తి నారా లోకేష్ మీకు అవసరమా..? అని ప్రశ్నించారు అనిల్ కుమార్.. ప్రజల కోసం పాదయాత్రలు చేస్తున్నానంటూ నాటకాలు, భూటకపు మాటలు చెప్పిన ఆ పప్పు ఢిల్లీకి పారిపోయాడు… ఎక్కడ తనని కూడా లోపల వేస్తారేమోనని పాదయాత్ర మధ్యలోనే వదిలేసి వెళ్లిన పప్పు మీకు న్యాయం చేస్తాడా..? అని ప్రశ్న వేశారు.. ఈ రోజు జరుగుతున్న పోరాటం బలిసిన వాడికి, బక్కవాడికి.. బక్కవాడి పక్కన జగన్ మోహన్ రెడ్డి ఉంటే, బలిసిన వాడి పక్కన చంద్రబాబు, దత్తపుత్రుడు ఉన్నారన్నారు. ఎవరైనా పార్టీ పెట్టిది అధికారంలోకి రావాలని, కానీ, పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం పార్టీ పెట్టాడని ఆరోపించారు. చంద్రబాబు ని అరెస్ట్ చేస్తే కొడుకే పట్టించుకోలేదు.. కానీ, పవన్ మాత్రం రోడ్డు మీద పడుకున్నాడు.. అని ఎద్దేవా చేశారు.. పక్కవాడి పార్టీ కోసం పవన్ వచ్చి రోడ్డుమీద పడుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లినందుకు సింపతీ వచ్చిందని మీడియాలో చెప్పుకుంటున్నారు.. కానీ, సింపతీ లేదు తొక్క తోటకూర ఏమీ లేదన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!