Site icon NTV Telugu

Anil Ambani: రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..!

Ed

Ed

Anil Ambani: అనిల్ అంబానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందర విచారణకు హాజరయ్యారు. గురువారం ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనను మనీ లాండరింగ్ కేసులో రెండోసారి ప్రశ్నిస్తున్నారు. రూ. 40,000 కోట్ల భారీ బ్యాంకు మోసం ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్!

ఈ కేసు ప్రధానంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) సంస్థకు సంబంధించినది. బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాలను విదేశీ అనుబంధ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ED అనుమానిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద అధికారులు అంబానీ స్టేట్‌మెంట్‌ ను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 2025 ఆగస్టులో ఒకసారి విచారణకు హాజరైన ఆయనను ఇప్పుడు రెండోసారి ప్రశ్నించడం గమనార్హం. ఈ కేసులో భాగంగా RCOM మాజీ అధ్యక్షుడు పునీత్ గార్గ్ ను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు.

Bangladesh: బంగ్లా అధ్యక్షుడిపై విమర్శలు.. అంటే, యూనస్ అరాచకాలు నిజమేనా..

ఇదిలా ఉండగా.. ED తాజాగా అంబానీకి చెందిన ముంబైలోని విలాసవంతమైన నివాసం ‘Abode’ను అటాచ్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. సుమారు రూ. 3,716 కోట్ల విలువైన ఈ ఆస్తి ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ED ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. అంబానీకి చెందిన కంపెనీలపై ఉన్న పలు రుణ మోసం కేసులను ఈ SIT పరిశీలిస్తోంది. ముఖ్యంగా బ్యాంకు రుణాల చెల్లింపుల్లో అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి అంశాలపై లోతైన విచారణ కొనసాగుతోంది.

Exit mobile version