Andhrapradesh: జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చిట్లు పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం అప్లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
ఇదిలా ఉండగా.. గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.
ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన సీఈఓ ఎంకే మీనా.
మొత్తం ఓటర్లు: 4,08,07,256
పురుషులు: 2,00,09,275
మహిళలు: 2,07,37,065
ధర్డ్ జెండర్: 3482
సర్వీస్ ఓటర్లు: 67,434
అత్యధిక ఓటర్లు: కర్నూలు జిల్లా: 20,16,396
అత్యల్ప ఓటర్లు: అల్లూరి జిల్లా: 7,61,538
*ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో పెరిగిన ఓటర్ల సంఖ్య. సుమారు 5.86 లక్షల మేర పెరిగిన ఓటర్లు.
*ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా 70 కేసుల నమోదు. నెల్లూరు, బాపట్ల, నంద్యాల, అనంతపూర్, కోనసీమ, కాకినాడ, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదు.
*తుది జాబితాపై అభ్యంతరాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు. స్పెషల్ సెల్ ఇన్ఛార్జీగా అదనపు సీఈఓ హరేంధీర ప్రసాద్.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..