Ranji Trophy 2024: 4 పరుగుల తేడాతో పరాజయం.. టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh beat Andhra in Ranji Trophy 2024 Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన రికీ భుయ్ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది.
శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆంధ్ర జట్టు ముందుగా బౌలింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. యష్ దూబే (64) టాప్ స్కోరర్. ఆంధ్ర బౌలర్లు కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్ రెడ్డి మూడు వికెట్స్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 172 పరుగులకే ఆలౌట్ అయింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 ఫర్వాలేదనిపించారు. స్టార్ ప్లేయర్ హనుమ విహారి (14) నిరాశపరిచాడు. ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
Also Read: IND vs ENG 4th Test: గెలుపు వాకిట తడబడుతున్న టీమిండియా.. విజయానికి ఎంత కావాలంటే?
62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 107 ఆలౌట్ అయింది. హిమాన్షు మంత్రి (43) ఒక్కడే పోరాడాడు. నితీశ్ రెడ్డి 4 వికెట్స్ తీశాడు. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. అప్పటికి విజయం ఆంధ్ర వైపే ఉంది. ఈరోజు హనుమ విహారి (43), కరణ్ షిండే (5) త్వరగా అవుటయ్యారు. అశ్విన్ హెబ్బర్ (22) పోరాడినా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. గిరినాథ్ రెడ్డి (15) పోరాడినా తృటిలో విజయం చేజారింది. ఈ విజయంతో మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
- Tags
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!