Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏలూరు నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అలాగే ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. అదేవిధంగా కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్‌ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్‌కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!