CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Markapuram Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉదయం 10.45 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లి అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. జూలై నెల తొలి దశ లక్ష్యాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా కొనసాగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసి, లబ్ధిదారులు, రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ఇక, మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12.55 గంటలకు గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించి, లబ్ధిదారులు, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. సంజీవని కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీస్తూ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించనున్నారు. తదుపరి మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రజావేదిక వద్ద జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.35 గంటల నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సాయంత్రం హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి అమరావతి (ఉండవల్లి నివాసం)కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఒకే రోజులో యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!