ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీస్తుందని భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. శాసనసభలో సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన విధానం ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనుంది.
గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యతగా ఉండగా.. ఇప్పుడు జనాభాను పెంచడం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోయింది. సుస్థిర అభివృద్ధికి ఇది 2.1 శాతం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23 శాతానికి చేరుతుందని.. ఇది ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also:Deputy CM Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు..!
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగిన తల్లులకు కాన్పు సమయంలో రూ. 25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. అంతే కాకుండా.. రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒక నెల, మూడో బిడ్డ పుడితే రెండు నెలల పెయిడ్ లీవ్ మంజూరు చేస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పిల్లల చదువు కోసం అందించే ఈ పథకం జనాభా వృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also:Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. RSS ప్రముఖులు, జయప్రకాశ్ నారాయణ వంటి మేధావులు కూడా జనాభా సమతుల్యత అవసరమని అభిప్రాయపడటం ఈ పాలసీకి బలాన్నిస్తోంది. వచ్చే నెల రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ డ్రాఫ్ట్ పాలసీకి తుది రూపు ఇవ్వనున్నారు. జనాభా నిర్వహణలో దేశంలోనే ఏపీ ఒక రోల్ మోడల్‌గా నిలవనుంది.