Snapchat Love Story: స్నాప్‌చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snapchat Love Story: ప్రేమకు సరిహద్దులు లేవంటారు.. కానీ ఆ ప్రేమ కోసమే సరిహద్దులు దాటిన ఒక పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) యువకుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా యాప్ ‘స్నాప్‌చాట్’ వేదికగా చిగురించిన ప్రేమ కోసం ఏకంగా ప్రాణాలకు తెగించి నియంత్రణ రేఖ (LoC) దాటిన జీషాన్ మీర్ అనే యువకుడిని భారత సైన్యం సురక్షితంగా మళ్లీ పాకిస్థాన్ అధికారులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. పీఓకేకు చెందిన జీషాన్ మీర్ అనే యువకుడికి జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక యువతితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది. ఎలాగైనా తాను ప్రేమించిన యువతిని కలుసుకోవాలని, అలాగే తన పూర్వీకుల భూమిని ఒకసారి చూడాలనే ఆశతో ఆ యువకుడు భారత్‌లోకి రావాలని ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలోనే మే 31న ఉరీ సెక్టార్ వద్ద అత్యంత ప్రమాదకరమైన ఎల్ఓసీ సరిహద్దును దాటుతుండగా అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల్లో పట్టుబడిన జీషాన్ మీర్‌ను భారత రక్షణ రంగ, నిఘా వర్గాలు క్షుణ్ణంగా విచారించాయి. ఈ విచారణలో అతను కేవలం తన ప్రియురాలిని వివాహం చేసుకుని భారత్‌లోనే స్థిరపడాలనే ఉద్దేశంతోనే వచ్చానని, అంతకు మించి తనకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని వెల్లడించాడు. నిఘా వర్గాల సుదీర్ఘ విచారణ అనంతరం అతని వద్ద ఎలాంటి ఆయుధాలు గానీ, ఉగ్రవాద కోణం గానీ లేవని అధికారులు నిర్ధారించారు. మానవతా దృక్పథంతో ఆలోచించిన భారత ప్రభుత్వం, అన్ని రకాల చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం చకన్-దా-బాగ్ సరిహద్దు పాయింట్ వద్ద జీషాన్ మీర్‌ను పాకిస్థాన్ అధికారులకు సురక్షితంగా అప్పగించింది. స్నాప్‌చాట్ ప్రేమ కోసం యువకుడు బోర్డర్ దాటిన ఈ క్రేజీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!