CM KCR On BRS Party: బీఆర్ఎస్ సరదా కోసం కాదు.. దేశం కోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భవన్ లో ఇవాళ సందడి నెలకొంది. ఏపీకి చెందిన నేతలు కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేతలకు స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, జేటీ రామారావు, వంశీ కృష్ణ, సతీష్ కుమార్, ఫణికుమార్, మణికంఠ, నయిముల్ హక్ లకు స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. కచ్చితంగా లక్ష కి.మీ. ప్రయాణం అయినా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ప్రపంచంలో మానవజీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయి అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
Read Also: Indian Railways: 2021తో పోలిస్తే 2022లో రైల్వేశాఖకు భారీగా పెరిగిన ఆదాయం
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
మీ అందరికి స్వాగతం చెబుతున్నా.. అయితే మీపై చాలా పెద్ద బాధ్యత పెడుతున్నానన్నారు కేసీఆర్. స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం. జీవితాలను ఆస్తులను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో, అంబేద్కర్ మార్గదర్శనంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని కార్యకలాపాలు మొదలుపెట్టాం. చక్కటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం అని కేసీఆర్ గుర్తు చేశారు. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఒక విజన్, డైరెక్షన్ ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని బాటలు వేయబడ్డాయి. సాగుతూ వచ్చాం.
ఆ తర్వాత రాజకీయాలు, ప్రజాజీవితంలో అనేక మార్పులు సంభవించాయి. గత 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాల్నో చేరుకోలేదు. ప్రజల కోరికలు, స్వాతంత్ర్య ఫలాలు సిద్ధించలేదు. మన కంటే అమెరికా, చైనా ముందున్నవి. అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయి. 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి చైనాలో ఉంది. కానీ మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో రమారమి 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్ తెలిపారు.
మనదేశంలో అనేక వనరులు ఉన్నాయన్నారు. వ్యవసాయం బాగా, అద్భుతంగా జరగాలంటే.. సూర్యకాంతి ఉండాలి. అప్పుడే పంటలు పండుతాయి. సూర్యకాంతి కూడా అపారంగా ఉంది. మన వద్ద మూడు రకాల పర్యావరణ మండలాలు ఉంటాయి. సముద్ర తీరప్రాంతాల్లో ఉండే వాతావరణం పలు రాష్ట్రాల్లో ఉంది. ప్రపంచంలోనే ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్కలిగి ఉండే కంట్రీగా ఉండాలి. మన రైతు లోకమంతా బ్రహ్మాండంగా ఉండాలి. కానీ 13 నెలల పాటు రైతులు ధర్నాలు చేసి, ప్రాణాలు కోల్పోయారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయాల విలువైన పామాయిల్, కందిపప్పును దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు ఈ దేశం వంచించబడుతుంది. ఈ దుస్థితి కొనసాగాల్నా. లేదు నివారించబడాల్నా.. ప్రజాజీవితంలో ఉండే ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ప్రపంచంలో మానవజీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయి అని కేసీఆర్ గుర్తు చేశారు.
మన దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్లు. కానీ దేశం ఏనాడూ కూడా రెండు లక్షల 10 వేల మెగావాట్లకు మించి వాడలేదు. నీళ్లుంటాయి కానీ పొలాలకు రావు. కరెంట్ ఉంటది కానీ ప్రజలకు రాదు. వనరులు, వసతులు ఉండి ఈ దేశం ప్రజలు శిక్షించబడాలి. వంచించబడాలి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగాలి? ఇందులో ఏదైనా మార్పు రావాలి అన్నారు. ఏపీ నుంచి బీఆర్ఎస్ నేతల చేరికతో హైదరాబాద్ లో సందడి నెలకొంది.
తాజావార్తలు
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
-
Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!