YS Rajasekhara Reddy: వైఎస్‌కు గవర్నర్ నివాళి.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Rajasekhara Reddy: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నా నివాళులు.. దార్శనికత ఉన్న నాయకుడు వైఎస్ఆర్ అంటూ కొనియాడారు గవర్నర్.. రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన వ్యక్తి వైఎస్సార్ అని పేర్కొన్న ఆయన.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఇక, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిలిచిపోయారని సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. సంక్షేమానికి కొత్త భాష్యం చెబుతూ.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన నేత ఆయన.. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందించిన గొప్ప నేత. జయమ్మ, రాజారెడ్డి దంపతులకు 1949 జూలై 8న కడప జిల్లా, జమ్మలమడుగులోని సీఎస్ఐ కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు అడుగులు వేశారు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి సీఎం వరకు అనేక పదవులు ఆయన నిర్వహించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేగా.. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు మరువలేనివి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వరుస ఓటముల సమయంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా ప్రస్థానం పేరుతో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది.. అయితే, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన నేలకొరిగారు.. ఆ మహానేత తమకు లేడని తెలిసి ఎన్నో గుండెలు ఆగాయి.. అంతలా ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆ మహా నేతను తలచుకుంటూనే ఉన్నారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered rich tributes to Dr. Y.S. Rajasekhara Reddy, Former Chief Minister in united Andhra Pradesh, on his death anniversary. pic.twitter.com/JgSHCGOgxR
— governorap (@governorap) September 2, 2023
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!