CM YS Jagan: దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించారు.. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం.. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం.. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ #AmbedkarJayanti యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
కాగా, బాబాసాహెబ్‌గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ .. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికతకోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తి రీత్యా లాయరు, బౌద్ధుడు, తత్వవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థికవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన జయవంతి సందర్భంగా.. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు.. ఇలా అంతా ఉత్సవాలు నిర్వహిస్తోన్నారు.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అతి పెద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఈ రోజు ఆవిష్కరించనున్న విషయం విదితమే.
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. 1/2 pic.twitter.com/Lt1TQ5711D
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023