AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలకాంశాలపై చర్చ
- ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం
- అమరావతిలో 20 వేల కోట్ల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులపై చర్చ
- పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలో 20 వేల కోట్ల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ అథారిటీ అమోదించిన పలు ప్రాజెక్ట్‌ల ఆమోదం కోసం కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్లో చర్చ సాగనుంది.. మరోవైపు.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.. ఇక, రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీ షెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపుపై చర్చించనున్నారు. పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల విషయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Mumbai Train Incident: మహిళల కంపార్టుమెంట్లో నగ్నంగా ప్రయాణించిన యువకుడు.. (వీడియో)
Also Read
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే సీఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.. మరోవైపు.. కాకినాడ పోర్ట్‌లో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడం కూడా చర్చగా మారింది.. ఈ తరుణంలో పీడీఎస్ రైస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు