AP Budget 2025: బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారంటే..
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్
- ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
- రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
Read Also: AP Budget 2025: బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
Also Read
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ఇక బడ్జెట్‌లో కీలక కేటాయింపుల విషయానికి వస్తే.. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అనేక రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, బీసీ సంక్షేమం, ఎస్సీ-ఎస్టీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించిందో వివరాలు ఇలా ఉన్నాయి.
* మొత్తం బడ్జెట్: రూ.3.22 లక్షల కోట్లు,
* వెన్యూ వ్యయం – రూ.2,51,162 కోట్లు,
* మూలధన వ్యయం – రూ.40,635 కోట్లు,
* రెవెన్యూ లోటు – రూ.33,185 కోట్లు,
* ద్రవ్య లోటు – రూ.79,926 కోట్లు
* బీసీల సంక్షేమానికి – రూ.47,456 కోట్లు,
* పాఠశాల విద్యాశాఖకు – రూ.31,805 కోట్లు,
* ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం – రూ.27,518 కోట్లు,
* ఎస్సీల సంక్షేమానికి – రూ.20,281 కోట్లు,
* వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి – రూ.19,264 కోట్లు,
* పంచాయతీ రాజ్ శాఖకు – రూ.18,847 కోట్లు,
* జలవనరుల శాఖకు – రూ.18,019 కోట్లు,
* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు – రూ.13,862 కోట్లు,
* ఇంధన శాఖకు – రూ.13,600 కోట్లు,
* వ్యవసాయ అనుబంధ రంగాలకు – రూ.13,487 కోట్లు,
* తల్లికి వందనం కోసం – రూ.9,407 కోట్లు,
* ఆర్‌అండ్‌బీకి – రూ.8,785 కోట్లు,
* గృహ మంత్రిత్వ శాఖకు – రూ.8,570 కోట్లు,
* ఎస్టీల సంక్షేమానికి – రూ.8,159 కోట్లు,
* గృహ నిర్మాణ శాఖకు – రూ.6,318 కోట్లు,
* అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ.5,434 కోట్లు,
* మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి – రూ.4,332 కోట్లు,
* పౌరసరఫరాల శాఖకు – రూ.3,806 కోట్లు,
* డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ.3,486 కోట్లు,
* పరిశ్రమలు, వాణిజ్య శాఖకు – రూ.3,156 కోట్లు,
* జల్ జీవన్ మిషన్ కోసం – రూ.2,800 కోట్లు,
* దీపం 2.0 పథకానికి – రూ.2,601 కోట్లు,
* ఉన్నత విద్యకు – రూ.2,506 కోట్లు,
* నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు – రూ.1,228 కోట్లు,
* ఆదరణ పథకానికి – రూ.1000 కోట్లు,
* స్వచ్ఛాంధ్ర కోసం – రూ.820 కోట్లు,
* యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు – రూ.469 కోట్లు,
* మత్స్యకార భరోసాకు – రూ.450 కోట్లు,
* ఆర్టీజీఎస్ కోసం – రూ.101 కోట్లు,
* తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం – రూ.10 కోట్లు,
* మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి – రూ.10 కోట్లు.
ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా వ్యవసాయ, విద్య, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు అనేక ప్రోత్సాహక పథకాలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?