తెలుగు బుల్లితెరపై లెజండరి యాంకర్ అంటే సుమ పేరు వినిపిస్తుంది..స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎప్పుడూ డ్రెస్సింగ్ లో మార్పులు లేవు.. ఎంతో పద్దతిగా చలాకీగా ఉంటుంది.. చాలా మంది సుమను ఆదరించడానికి కారణం కూడా ఇదే.. అలాంటి సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.. కుర్ర యాంకర్స్ తో పోటి పడుతూ నేనేం తక్కువ కాదు అంటూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. సుమ కూడా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. సుమలోని ఊహించని కోణం మైండ్ బ్లాక్ చేస్తుంది..
టెలివిజన్ మొదలైనప్పటి నుంచి సుమ యాంకర్ గా రానిస్తున్నారు.. ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహారిస్తూ రచ్చచేస్తుంది.. కాలం మారినా, కొత్త సరుకు దిగినా సుమకు మాత్రం పోటీ కాలేకపోయారు. ఆమె స్థానం పదిలంగా ఉంది. కాగా ప్రతి యాంకర్ సోషల్ మీడియాను విరివిగా వాడుతున్నారు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి పాప్యులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. ఇటీవల సుమ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది..
ఇండస్ట్రీలో ఎంత టాలెంట్, ఫ్యాన్ బేస్ ఉన్నా… ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే. అందుకే సుమ కూడా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. అలాగే ఆసక్తికర రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో సుమకు రెండున్నర మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా సుమ ఫోటో షూట్స్, వీడియోలను చూస్తారు.. దాంతో సంపాదన కూడా ఉంటుంది.. అయితే సుమ పలు షోలతో పాటు సినిమాలను కూడా చేస్తుంది.. ఇక ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు.. అది ఇప్పటికి చర్చలకు దారి తీసింది..