Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anaparthi: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మొత్తం 13 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో జరిగిన మహేంద్రవాడ చోరీ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జిల్లేళ్ల రాకేష్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఈ చోరీల వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు వెల్లడైంది.
రాకేష్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి, ముఠాలోని మరో ముగ్గురు సభ్యులు చెల్లూరి జగదీష్, చెల్లూరి వీరేంద్ర, టి. సత్యనారాయణలను అరెస్ట్ చేశారు. వీరు అనపర్తితో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.75 లక్షల 85 వేల విలువైన బంగారు ఆభరణాలు, అలాగే 6.5 కిలోల వెండి వస్తువులు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ లక్షల్లో ఉండటంతో ఈ కేసు జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ముఠాపై అనపర్తి, కడియం, అంగర, మండపేట, తణుకు, తాడేపల్లిగూడెం, పెనుగొండ ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 13 కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చోరీలతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు, నిందితుల అరెస్టుతో ఊపిరి పీల్చుకున్నారు. కేసును ఛేదించి భారీ రికవరీ సాధించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.
Also Read
- RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. "జాఫర్ ఎక్స్‌ప్రెస్"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
తాజావార్తలు
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?