Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
- ఓటీటీ ట్రెండింగ్‌లో ‘అనంతన్ కాడు’..
- సునీల్ సైకో పోలీస్‌గా విభిన్నమైన నెగెటివ్ పాత్ర
- క్రూరమైన బాడీ లాంగ్వేజ్‌తో సునీల్ ఆకట్టుకునే నటన
- ఆర్య ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananthan Kaadu: ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్.. ఇప్పుడు విలన్‌గా తన నటనతో మెప్పిస్తున్నాడు. తెలుగు సినిమాలతో పాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ ప్రతినాయక పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా సునీల్ సైకో పోలీస్ పాత్రలో నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జీఎన్ కృష్ణకుమార్ తెరకెక్కించారు. తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమాకు నటుడు, రచయిత మురళీ గోపి కథ అందించారు. గోకులం గోపాలన్ నిర్మించిన ఈ సినిమా జూన్ 25న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. యాక్షన్, క్రైమ్, పొలిటికల్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
రాజకీయాల నేపథ్యంలో:
‘అనంతన్ కాడు’ కథ 1990ల కాలం నాటి తిరువనంతపురం నేపథ్యంలో సాగుతుంది. ఆ సమయంలో రాజకీయ ఉద్రిక్తతలు, రౌడీయిజం, పవర్ బ్రోకర్ల ప్రభావం తీవ్రంగా ఉండే పరిస్థితులను కథలో చూపించారు. స్థానిక వీధి రౌడీలు తమ ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు శ్రీలంక తమిళ తిరుగుబాటుదారుడితో చేతులు కలపడం.. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాల చుట్టూ కథ ముందుకు సాగుతుంది.
సాధారణంగా గొడవలకు దూరంగా ఉండాలని భావించే ఓ యువకుడు అనుకోకుండా రాజకీయ, రౌడీ ముఠాల వివాదాల్లోకి లాగబడతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ రాజకీయ, క్రైమ్ ప్రపంచం నుంచి బయటపడేందుకు అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? అనేదే సినిమా ప్రధాన కథాంశం.
సైకో పోలీస్‌గా సునీల్ విలనిజం:
ఈ సినిమాలో సునీల్ పోషించిన పాత్ర ప్రత్యేకంగా చెప్పాలి. సైకో పోలీస్ ఆఫీసర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించిన ఆయన.. ఇప్పటివరకు చేసిన విలన్ పాత్రలతో పోలిస్తే మరింత భిన్నమైన నటనను ప్రదర్శించినట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. క్రూరమైన స్వభావం, భయపెట్టే బాడీ లాంగ్వేజ్‌తో సునీల్ తన పాత్రకు మరింత బలాన్ని తీసుకొచ్చాడు. ఓ యువతిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించే సన్నివేశాల్లో సునీల్ పాత్రలోని పైశాచిక స్వభావాన్ని చూపించారు. దీంతో సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకుల్లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కామెడీతో ప్రేక్షకులను అలరించిన నటుడు ఇంత భిన్నమైన ప్రతినాయక పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రత్యేకతగా మారింది.
మరోవైపు ఆర్య ఈ సినిమాలో వెట్రివేల్ కుమారన్ అనే పాత్రలో కనిపించాడు. శ్రీలంక తమిళుడి పాత్రలో కనిపించిన ఆయన.. సాధారణ యాక్షన్ హీరో ఇమేజ్‌కు భిన్నంగా ఈ సినిమాలో నటించాడు. రాజకీయ ముఠాల మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకునే సంఘటనలను ఆర్య పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు. మురళీ గోపి, రెజినా కసాండ్రా, నిఖిలా విమల్, దేవ్ మోహన్, ఇంద్రన్స్, విజయ రాఘవన్, అప్పాని శరత్, శాంతి బాలచంద్రన్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో పలు ఉపకథలు ఉండటంతో ప్రధాన కథనం కొంత ఉన్నపటికీ.. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఒకేసారి 5 ఓటీటీల్లో రిలీజ్:
థియేటర్ల తర్వాత ‘అనంతన్ కాడు’ సినిమా ఒకేసారి 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. విదేశీ ప్రేక్షకుల కోసం సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా వంటి ప్లాట్‌ఫామ్స్ లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తెలుగులో చూసే అవకాశం కూడా వచ్చింది. ప్రస్తుతం లయన్స్‌గేట్ ప్లేలో మాత్రమే ‘అనంతన్ కాడు’ తెలుగు ఆడియో అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ప్రధానంగా తమిళం, మలయాళం వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఓటీటీలో ట్రెండింగ్:
ఓటీటీలోకి వచ్చిన తర్వాత ‘అనంతన్ కాడు’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 8 నాటికి ఈ సినిమా ట్రెండింగ్‌లో 10వ స్థానంలో ఉంది. IMDbలో ఈ చిత్రానికి 6.1 రేటింగ్ నమోదైంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్, 1990ల కేరళ రాజకీయ పరిస్థితులు, గ్యాంగ్‌స్టర్ అంశాలు, క్రైమ్, యాక్షన్‌తో పాటు సునీల్ సైకో పోలీస్ పాత్రలో చేసిన విభిన్నమైన నటన చూడాలనుకునే వారికి ‘అనంతన్ కాడు’ ఓటీటీలో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!