NTV Telugu Site icon

Anant-Radhika wedding: అనంత్-రాధిక పెళ్లి కబురు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!

Marrige

Marrige

ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. అంబానీ ఆహ్వానం మేరకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. మూడు రోజుల పాటు వేడుకలు అలరించాయి. ఇక బాలీవుడ్ హీరోల డ్యాన్సులు.. పాప్ సింగర్ రిహన్నా నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి: RCB vs KKR: అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందా.. వీడియో వైరల్..

ఇక తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుక గురించి తాజాగా మరో వార్త అందుతోంది. వీరిద్దరి వివాహం జూలైలో జరగనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకను ఇండియాలో కాకుండా లండన్‌లో నిర్వహించేందుకు అంబానీ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులకు అంబానీ కుటుంబం ఆహ్వాన పత్రికలు పంపినట్లు తెలుస్తోంది. 2021లో లండన్‌లో అంబానీ కొనుగోలు చేసిన పార్క్ ఎస్టేట్‌లో ఈ ఫంక్షన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

2022, డిసెంబర్‌లో రాజస్థాన్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ రోకా వేడుకను నిర్వహించారు. జనవరి, 2023లో ముంబయిలోని అంబానీ నివాసంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు మధ్య నిశ్చితార్థం జరిగింది. ఇక ఏప్రిల్ నెల ప్రారంభంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గట్టి భద్రత మధ్య 20 కార్ల కాన్వాయ్‌తో దుబాయ్‌లోని రెండు మాల్స్‌లో షాపింగ్ చేశారు. ఫ్రీ వెడ్డింగ్ వేడుకలే ఘనంగా నిర్వహించారు. ఇక పెళ్లి కూడా అంతకంటే అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ కుబేరులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu: ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్

అనంత్-రాధిక చిన్నప్పటి నుంచి ఒకరికొకరికి పరిచయం ఉంది. 2018లో వారి బంధం మ్యాచింగ్ దుస్తులను ధరించి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పటి నుంచి చర్చనీయాంశమైంది. ఆ నాటి నుంచి రాధిక నిరంతరం అంబానీ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉంది. మొత్తానికి స్నేహం కాస్త.. వివాహ బంధానికి దారి తీసింది. మరికొన్ని రోజుల్లో మూడు ముళ్లతో ఈ బంధం ఒక్కటి కాబోతుంది.

Show comments