Anant-Radhika wedding: అనంత్-రాధిక పెళ్లి కబురు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. అంబానీ ఆహ్వానం మేరకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. మూడు రోజుల పాటు వేడుకలు అలరించాయి. ఇక బాలీవుడ్ హీరోల డ్యాన్సులు.. పాప్ సింగర్ రిహన్నా నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి: RCB vs KKR: అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందా.. వీడియో వైరల్..
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
ఇక తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుక గురించి తాజాగా మరో వార్త అందుతోంది. వీరిద్దరి వివాహం జూలైలో జరగనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకను ఇండియాలో కాకుండా లండన్‌లో నిర్వహించేందుకు అంబానీ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులకు అంబానీ కుటుంబం ఆహ్వాన పత్రికలు పంపినట్లు తెలుస్తోంది. 2021లో లండన్‌లో అంబానీ కొనుగోలు చేసిన పార్క్ ఎస్టేట్‌లో ఈ ఫంక్షన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
2022, డిసెంబర్‌లో రాజస్థాన్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ రోకా వేడుకను నిర్వహించారు. జనవరి, 2023లో ముంబయిలోని అంబానీ నివాసంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు మధ్య నిశ్చితార్థం జరిగింది. ఇక ఏప్రిల్ నెల ప్రారంభంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గట్టి భద్రత మధ్య 20 కార్ల కాన్వాయ్‌తో దుబాయ్‌లోని రెండు మాల్స్‌లో షాపింగ్ చేశారు. ఫ్రీ వెడ్డింగ్ వేడుకలే ఘనంగా నిర్వహించారు. ఇక పెళ్లి కూడా అంతకంటే అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ కుబేరులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu: ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్
అనంత్-రాధిక చిన్నప్పటి నుంచి ఒకరికొకరికి పరిచయం ఉంది. 2018లో వారి బంధం మ్యాచింగ్ దుస్తులను ధరించి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పటి నుంచి చర్చనీయాంశమైంది. ఆ నాటి నుంచి రాధిక నిరంతరం అంబానీ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉంది. మొత్తానికి స్నేహం కాస్త.. వివాహ బంధానికి దారి తీసింది. మరికొన్ని రోజుల్లో మూడు ముళ్లతో ఈ బంధం ఒక్కటి కాబోతుంది.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!