ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ వేడుకను రీసెంట్గా చాలా ఘనంగా జరిపారు. కాగా.. తాజాగా పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. వివాహ వేడుకలు మే 29న ఇటలీలో ప్రారంభమై జూన్ 1 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకలు స్విట్జర్లాండ్‌లో ముగియనున్నాయి. అయితే.. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, అంతర్జాతీయ ప్రముఖులు ఎంతో మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు.
Kakani Govardhan Reddy: బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ వేడుకలో దాదాపు 800 మంది అతిధులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ని ఒకే చోట కాకుండా ఇటలీ నుంచి బయల్దేరి భారీ లగ్జరీ షిప్‌లో ఆనంద్ అంబానీ వివాహ వేడుక జరుగనుంది. అతిథులు మే 29న ఇటలీలోని సిసిలీ నుండి క్రూయిజ్ ఎక్కి.. స్విట్జర్లాండ్ లో దిగనున్నారు. మూడు రోజుల పాటు భారీ షిప్ లోనే ఈ వేడుక జరుగనుంది. కాగా.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ మరియు ఆకాష్ అంబానీ మినహా మిగిలిన అంబానీ కుటుంబ సభ్యులు క్రూయిజ్ పార్టీ ఫిట్టింగ్‌ల కోసం లండన్‌లో ఉన్నట్లు సమాచారం.
Blackout Movie: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న 12 ఫెయిల్ హీరో మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓడలో అతిథులను అలరించడానికి దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంబానీ ఫ్యామిలీ రకరకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే.. మార్చిలో జామ్‌నగర్‌లో జరిగిన వివాహ వేడుకలో ప్రత్యేక కార్యక్రమాలు జరిపించారు. అందులో ఫుడ్ కోసం స్పెషల్ అరెంజ్మెంట్స్ చేశారు. అందుకు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేశారు. కాగా.. అనంత్ అంబానీ-రాధిక పెళ్లి వేడుకకు ఇప్పటి వరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.
