బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. ఆ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటిని సంపాదించుకున్న హీరో గత ఏడాది 12 ఫెయిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు.. హిట్ అవ్వడం మాత్రమే కాదు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో నటించాడు..
విక్రాంత్ మాసే హీరోగా బ్లాక్ఔట్ సినిమా రూపొందింది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తోంది.. ఈ సినిమా జూన్ 7న నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ జూన్ 7 నుంచి జూన్ 7న స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు జియో సినిమా ప్రకటించింది..
ఇక ఈ సినిమాలో విక్రాంత్ మాసే, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించగా.. సునీల్ గ్రోవర్, జిషు సెంగుప్త, ఛాయాకదమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. దేవంగ్ శశీన్ భవ్సర్ దర్శకత్వం వహించారు.. అతనికి ఇది మొదటి సినిమా అయినా ఓటీటీలో విడుదల చెయ్యడం విశేషం.. ఈ సినిమా ఓటీటిలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి..