Anant-Radhika Pre-Wedding: ఖరీదైన క్రూయిజ్ షిప్‌లో అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్.. 4 రోజుల పాటు గ్రాండ్‌గా ఫంక్షన్స్!

Anant Radhika Invitation Card

Anant Radhika Invitation Card

Anant-Radhika Pre-Wedding Invitation Card Goes Viral: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో 4 రోజుల పాటు గ్రాండ్‌గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్‌ ప్రయాణిస్తుంది. దాంతో అతిథులు యూరోపియన్, మధ్యధరా సముద్ర అందాలను బాగా ఎంజాయ్ చేయనున్నారు. అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ బాష్‌కి సంబందించిన ఓ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అనంత్-రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్‌పై బోల్డ్ లెటర్స్‌లో ‘లా విట్ ఈ అన్ వియాజియో’ అని రాసుంది. అంటే ‘లైఫ్ ఈజ్ ఎ జర్నీ’ అని అర్ధం. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ని ఇటలీ, ఫ్రాన్స్‌లలో నిర్వహించనున్నట్లు కార్డ్‌పై ఉంది. ఈ వేడుక మే 29 మొదలై.. జూన్ 1 వరకు జరుగుతుంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక మొదటి రోజున ‘పార్టీ వెల్‌కమ్ లంచ్’ థీమ్‌తో ప్రారంభమవుతుంది. సాయంత్రం ‘స్టార్రీ నైట్’ థీమ్ ఉంటుంది. రెండో రోజు ‘ఎ రోమన్ హాలిడే’ థీమ్‌తో కొనసాగుతుంది. రెండోరోజు లా డోల్స్ ఫార్ నియంతే, టోగా పార్టీ ఉంటుంది.

×
×
Ad

Also Read: Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎన్నెన్నో రికార్డులు సొంతం!

ఆకాష్ అంబానీ-శ్లోకా మెహతాల కుమార్తె వేద మొదటి పుట్టినరోజు 3వ రోజు జరుపుకుంటారు. రోజు ‘క్షమించు మై ఫ్రెంచ్’ థీమ్‌ ఉంటుంది. ఇక చివరి రోజు థీమ్ ‘లా డోల్స్ వీటా’. ఈ ప్రీ వెడ్డింగ్ కోసం 800 మంది అతిథులు రానున్నారట. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నారు. వీరికోసం క్రూయిజ్‌లో 600 మంది ఉద్యోగులు పని చేస్తారట. ఈ పార్టీ కోసం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్ వంటి స్టార్స్ వెళ్లారట. అనంత్-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ జామ్‌నగర్‌లో జరగ్గా.. అంబానీ కుటుంబం రూ.1,259 కోట్లు ఖర్చు చేసిందట. వీరి వివాహం జూలై 12న జియో వరల్డ్ సెంటర్‌లో జరగనున్నది.