అనంత్ అంబానీ (Anant ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలకు గుజరాత్‌లోని జామ్‌నగర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మార్చి 1 నుంచి 3 తారీఖు వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేర్లు, ఆయా కంపెనీల సీఈవోలను అంబానీ ఫ్యామిలీ ఆహ్వానించింది.
ఇకపోతే బుధవారం నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. జామ్‌నగర్ సమీపంలోని గ్రామస్తులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. స్వయంగా ముకేష్ అంబానీ, రాధిక మర్చంట్ కుటుంబాలు హాజరై వండించారు.
ఇక ప్రత్యేక అతిథులంతా గురువారమే జామ్‌నగర్‌కు చేరుకుంటున్నారు. విదేశీ అతిథులతో పాటు బాలీవుడ్ ప్రముఖులంతా గుజరాత్ చేరుకున్నారు. అగ్రహీరోలు సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్ ఇప్పటికే జామ్‌నగర్‌కు చేరుకున్నారు. అలాగే పలువురు విదేశీయులు కూడా విచ్చేశారు.
ఈ వేడుకలకు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపికా పదుకొణె మరియు రణబీర్ కపూర్ వంటి ప్రముఖులు బాలీవుడ్‌లోని అత్యుత్తమ తారలు తరలిరానున్నారు. విశిష్ట అతిథుల్లో మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరియు అడోబ్ సీఈవో శంతను నారాయణ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి హాజరుకానున్నారు. జుకర్‌బర్గ్ దంపతులు, బిల్ గేట్స్ ఇప్పటికే గుజరాత్ చేరుకున్నారు. మరికొందరు అతిథులు శుక్రవారం చేరుకోనున్నారు.
ఇదిలా ఉంటే పెద్ద ఎత్తున అతిథులు గుజరాత్‌కు రావడంతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది. ప్రజలు, అభిమానులు తమ అభిమాన నాయకుల్ని చేసేందుకు ఎగబడుతున్నారు. సెల్‌ఫోన్లలో బంధించేందుకు పోటీ పడుతున్నారు.
#WATCH | Gujarat | Actor Shah Rukh Khan along with his family arrives in Jamnagar for the three-day pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/1PP6p3fZJb
— ANI (@ANI) February 29, 2024