లైగర్.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయి లో విడుదలైంది లైగర్ సినిమా.ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, మరియు నిర్మాత చార్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ అస్సలు బయటకు రాలేదు.సినిమా తీవ్రంగా విఫలం కావడంతో ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ ఆందోళన చేసారు.మేము భారీగా నష్టపోయామని మాకు నష్టపరిహారం చెల్లించాలి అని సినిమా విడుదలైన తర్వాత పూరి జగన్నాథ్ పై వారు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకుని వచ్చారు.ఆ సమయంలో పూరి జగన్నాధ్ ఏదోరకంగా వారికీ సర్ది చెప్పుకుంటూ వచ్చారు.. కానీ ఆ వివాదం అంతటితో ముగియలేదు. ఇటీవల మరోసారి డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా బేబీ.ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈనెల 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ లైగర్ సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు.విజయ్ అన్న డైలాగ్ డెలివరీ అలాగే తన వాయిస్ ను ఇష్టపడే వారు చాలా మంది వున్నారు.పెళ్లిచూపులు సినిమా నుంచి ఒక డిఫరెంట్ వాయిస్ తెలుగు ఇండస్ట్రీలో వినిపించింది. ఆ వాయిస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది.అలాంటి వాయిస్ వున్న విజయ్ అన్నతో నత్తితో మాట్లాడించడం అనేది లైగర్ సినిమాకి మైనస్ అయింది.ప్రాపర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుంటే సినిమా కొత్తగా ఉండేది అని తన అభిప్రాయాన్ని తెలిపారు ఆనంద్ దేవరకొండ. లైగర్ సినిమా కోసం తన అన్నయ్య విజయ్ దేవరకొండ రెండేళ్లు ఎంతో కష్టపడ్డాడని ఆనంద్ తెలిపారు. బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.