Site icon NTV Telugu

Peddi : ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం ఊహించని హీరోయిన్?

Peddi

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం పలువురు ముద్దుగుమ్మలు పేర్లు వినిపించగా.. ఇప్పుడు మరో స్టార్ బ్యూటీ పేరు వైరల్ అవుతోంది.

Also Read : Ram Pothineni : ఫ్లాపులతో సాగిపోతున్న రామ్‌ పోతినేని కెరీర్‌

పెద్ది స్పెషల్ సాంగ్ కోసం ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ని మేకర్స్ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ ఒక ఎనర్జిటిక్ మాస్ ట్యూన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా హుషారైన బీట్‌తో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్. అందుకు తగ్గట్టే.. ఒకవేళ మృణాల్ ఠాకూర్ ఈ స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో పాటు, ఆమె గ్లామర్ మరింత హైప్ తీసుకురావడం ఖాయం. ప్రస్తుతం హీరోయిన్‌గా తెలుగులో ‘డెకాయిట్’ సినిమాతో పాటు.. అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లోను ఒక కీలక పాత్రలో నటిస్తోంది మృణాల్. ఇప్పుడు రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ అంటే, ఆమె నో చెప్పే ఛాన్స్ లేదు. అయితే, ఈ ఆఫర్ నిజంగానే మృణాల్ దగ్గరికి వెళ్లిందా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్‌ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే!

Exit mobile version