Site icon NTV Telugu

Adilabad: రూ.10 ఇచ్చి మైనర్ బాలికపై యువకుడి అఘాయిత్యం.. ఎలా బయటపడిందంటే..?

Gangrape

Gangrape

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో రూ.10 రూపాయలు ఇచ్చి మైనర్ బాలిక పై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. షీటీం అవగాహనతో విషయం బయటకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.. నిందితుడు బంగారిగూడకు చెందిన జాదవ్ కృష్ణగా గుర్తించి అరెస్టు చేశారు.

READ MORE: Hyderabad: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ టెకీ.. ఊడిన ఉద్యోగం.. అయినా మారని వైనం..

అసలు ఏం జరిగిందంటే.. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు షీ టీం బృందం వివిధ కళాశాలలో పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల నిర్వహిస్తున్న సమయంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఒక పాఠశాలలో షీ టీం బృందం మహిళల పట్ల విద్యార్థుల పట్ల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పిస్తోంది. ఈ సందర్భంలో ఒక విద్యార్థిని షీ టీం బృందాన్ని సంప్రదించి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన షీ టీం బృందం కుటుంబ సభ్యులకు వివరాలను వెల్లడించి, తండ్రి ద్వారా ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించింది. నిందితుడిని జాదవ్ కృష్ణ గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.

READ MORE: FASTag Annual Pass: రూ.3000 వార్షిక పాస్ ఎక్కడ తీసుకోవాలి.. ఏయే వాహనాలకు వర్తిస్తుంది..?

బంగారిగూడకు చెందిన జాదవ్ కృష్ణ ప్రతిరోజు రూ.10 ఇస్తూ చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తూ మైనర్ బాలికపై లైంగికంగా వేధించాడు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పోక్సో , బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు షీ టీం బృందం ఇన్‌ఛార్జి బి.సుశీల తెలియజేశారు. నిందితుడు ప్రతిరోజు ఈ 10 సంవత్సరాల మైనర్ బాలికతో లైంగికంగా వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించారు. మహిళలు, విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలిగిన, లైంగిక వేధింపులకు గురైన, ఆదిలాబాద్ షీ టీం బృందం అండగా ఉంటుందని తెలిపారు. 8712659953 నెంబర్ కి ఫోన్ చేసి షీ టీంని సంప్రదించవచ్చని, సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వెల్లడించారు.

Exit mobile version