NTV Telugu Site icon

Shivaji Statue: షాకింగ్ న్యూస్.. శివాజీ విగ్రహం కూలుతుందని ముందే తెలుసు.. చెప్పినా పట్టించుకోలేదు!

Shivaji

Shivaji

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది (4 డిసెంబర్ 2023) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మరోవైపు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విగ్రహాన్ని గతేడాది నేవీ డే రోజున ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. నేవీ, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తో సంబంధిత నిపుణులు ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం ఘటనలో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌లపై భారత న్యాయ స్మృతి 109, 110, 125, 318, 3(5) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు.

READ MORE: Ram Mohan Naidu: ఏపీలో నూతన విమానాశ్రయాలు.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి

కాగా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విగ్రహం క్షీణించడం గురించి స్థానిక పౌరులు, పర్యాటకులు, పీడబ్ల్యుడీ మల్వాన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి హెచ్చరించినప్పటికీ, ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదని స్పష్టమైంది. విగ్రహం శిథిలావస్థకు చేరుకుందని నేవీకి లేఖ రాసినప్పటికీ విగ్రహానికి మరమ్మతులు చేయలేదని ఓ ఇంజినీర్ కుండ బద్ధలు గొట్టారు. మరోవైపు “విగ్రహం తయారీలో ఉపయోగించిన ఉక్కు తుప్పు పట్టడం ప్రారంభించింది” అని సింధుదుర్గ్ గార్డియన్ మంత్రి రవీంద్ర చవాన్ ధృవీకరించారు. ఈ విషయాన్ని నేవీ అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ పరిష్కరించేందుకు పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు.