Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News An Emotional Love Story True Lover Coming To Ott When Will It Be Streaming

True Lover : ఓటీటీ లోకి రాబోతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published Date :February 15, 2024 , 12:30 pm
By Murali Krishna
True Lover : ఓటీటీ లోకి రాబోతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మణికందన్‌, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్..ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని తెలుగులో ట్రూ లవర్‌గా డైరెక్టర్ మారుతి మరియు బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి రిలీజ్ చేశారు.యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మణికందన్‌), దివ్య (శ్రీగౌరిప్రియ) ప్రేమించుకుంటారు. ప్రతి విషయంలో దివ్యను అనుమానిస్తుంటాడు అరుణ్‌. ఆమె మరొకరితో క్లోజ్‌గా మాట్లాడినా అస్సలు సహించలేడు. అరుణ్ ప్రవర్తనకు విసిగిపోయిన దివ్య అతడికి బ్రేకప్ చెప్పాలని ఎన్నో సార్లు అనుకుంటుంది.
దివ్య తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన ఓ టూర్‌కు ఆమె వెంట అరుణ్ కూడా వెళతాడు..అక్కడ ఏం జరిగింది..అరుణ్‌లో మార్పు వచ్చిందా..దివ్య ప్రేమను అర్థం చేసుకున్నాడా.. అన్నదే ఈ మూవీ కథ. అపనమ్మకం మరియు అభద్రతా భావంతో కూడిన ఏ ప్రేమ నిలబడదనే పాయింట్‌తో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ట్రైలర్‌ మరియు టీజర్స్‌తో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించింది. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. తమిళంలో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.తమిళంలో లవర్ మూవీ రజనీకాంత్ లాల్ సలామ్ కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ఆరు రోజుల్లో ఈ మూవీ పది కోట్ల వరకు గ్రాస్‌, నాలుగున్నర కోట్ల షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.. ట్రూ లవర్‌లో నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ భామ వైజయంతీ మూవీస్‌లో వచ్చిన ‘మెయిల్ ‘మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది . ఇటీవలే ఈ భామ మ్యాడ్‌ మూవీ తో తెలుగులో పెద్ద హిట్ అందుకున్నది. ఇదిలా ఉంటే ట్రూ లవర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళం మరియు తెలుగు స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం.ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందిన ట్రూ లవర్ మూవీ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.. మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #an emotional love story
  • #coming to ott
  • True Lover

తాజావార్తలు

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ‘అల్ట్రా’ మోడల్ వచ్చేస్తోంది.. 8500mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే

  • Riyan Parag: “వైభవ్‌కు ప్రేమికులు ఎక్కువ”.. సీక్రెట్స్ మొత్తం బయటపెట్టిన రాజస్థాన్ కెప్టెన్..

  • Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్‌ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!

  • Israel-lebanon war: ఓ వైపు ఇరాన్-అమెరికా చర్చలు.. ఇంకోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • New FASTag Rules: ఈ రోజే మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ఫాస్టాగ్ లేకపోయినా లేదా దానిని రీఛార్జ్ చేయకపోయినా ఏమవుంతో తెలుసా..?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions