NTV Telugu Site icon

Delhi: ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. చేతులు, కాళ్లు కట్టి యువకుడి నోటిలో మూత్ర విసర్జన

Delhi Crime

Delhi Crime

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా శనివారం రాత్రి ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. అంతకు ముందు యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అతని ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. కారం చల్లారు. ఆ యువకుడు నొప్పితో కేకలు వేస్తుండటంతో చేతులు, కాళ్లు కట్టి నోటిలో మూత్ర విసర్జన చేశారు నిందితులు. ఈ క్రూర ఘటన ఓ వీధిలో జరిగింది. అయితే.. ఆ యువకుడిని రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. యువకుడు శివ విహార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. యువకుడి స్వస్థలం మధ్యప్రదేశ్‌ ఛతర్‌పూర్‌ జిల్లాలోని రాగోలి. కాగా.. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులు నైనా అలియాస్ మీనా, రోహిత్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..

వివరాల్లోకి వెళ్తే.. యువకుడు కరణ్ మానసికంగా బాధపడుతున్నట్లు అతని సోదరుడు నిశాంత్‌ తెలిపాడు. కరణ్ కు ఊరికనే కోపం వస్తుందని, ఈ క్రమంలో అనేక మందితో చాలాసార్లు గొడవ పడేవాడని చెప్పాడు. ఈ క్రమంలో.. కొన్ని నెలల క్రితం ఆ ప్రాంతంలో చిరుధాన్యాలు అమ్మే మహిళ మీనాతో గొడవ పడ్డాడు. దీంతో.. అతనిపై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా.. యువకుడిని తన స్వగ్రామానికి పంపించారు. అయితే.. అతని కేసు కోర్టులో ఉంది కావున.. ఇటీవల కరణ్‌ను ఉత్తమ్ నగర్‌కు పిలిచారు. ఈ సమయంలో కరణ్ ఇక్కడికి వచ్చాడని మీనాకు తెలిసింది.

KTR : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలి

ఈ క్రమంలో.. శనివారం రాత్రి కరణ్ ఇంట్లో ఉన్న సమయంలో మీనా డజను మందితో కర్రలు, కత్తులతో అక్కడికి వచ్చారు. ఉన్నట్టుండి కరణ్‌పై దాడికి దిగారు. కరణ్‌ని రక్షించడానికి ఇరుగుపొరుగువారు కూడా సాహసించకపోవడంతో వారు అతన్ని తీవ్రంగా కొట్టారు. మధ్యలో ఎవరైనా వస్తే ఇలాగే చంపేస్తామని నిందితులు బెదిరించారు. కరణ్‌ను మొదట కొట్టి, ఆపై అతని ప్రైవేట్ భాగాలపై బుల్లెట్ బైక్‌తో తొక్కించారు. అంతేకాకుండా గాయాలపై ఉప్పు, కారం చల్లారు. తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో మూత్రం పోశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కరణ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో మీనా, రోహిత్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. విచారణలో మీనా ఆరు నెలల క్రితం తన ఇంట్లో మొబైల్, ఇతర వస్తువులను దొంగిలించాడని చెప్పింది. దీంతో అతడిని కొట్టామని పేర్కొంది.