Bihar: విద్యార్థులు హాజరు కాలేదని..దాదాపు రూ.23లక్షల జీతం తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్..
- 2019 సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరిన లాలన్ కుమార్..
- బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నితీశేశ్వర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న లాలన్
- విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదని వెల్లడి
- బోధించకుండా జీతం తీసుకోవడానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని జీతం వాపసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నితీశేశ్వర్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాలన్ కుమార్ తన 33 నెలల జీతాన్ని తిరిగి జీతాల విభాగానికి అందజేశారు. సుమారు దాదాపు రూ. 23 లక్షలు తిరిగి ఇచ్చారు. ఆయన 2019 సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరారు. ఈ 33 నెలల్లో విద్యార్థులు తన తరగతికి హాజరుకాలేదని ఆయన తెలిపారు. బోధించకుండా డిపార్ట్మెంట్ నుంచి జీతం తీసుకోవడానికి తన మనస్సాక్షి అనుమతించలేదని ఆయన అన్నారు. లాలన్ కుమార్ మంగళవారం బీఆర్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం (BRABU) రిజిస్ట్రార్‌కు 23,82,228 రూపాయల చెక్కును తిరిగి ఇచ్చారు. కళాశాల రాష్ట్ర విశ్వవిద్యాలయమైన బీఆర్ఏబీయూ (BRABU) ఆధ్వర్యంలో ఉంది. మీడియాతో లలన్ కుమార్ మాట్లాడుతూ.. ‘బోధించకుండా జీతం తీసుకోవడానికి నా మనస్సాక్షి అనుమతించదు. ఆన్లైన్ తరగతుల సమయంలో (కరోనా సమయంలో) కూడా హిందీ తరగతులకు కొద్దిమంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఐదేళ్లు బోధించకుండా జీతం తీసుకుంటే అది నాకు విద్యా మరణమే.” అని లాలన్ కుమార్ పేర్కొన్నారు.
READ MORE: Ola: గూగుల్ మ్యాప్ సర్వీస్ ను నిలిపేసిన ఓలా..ఏటా రూ. 100 కోట్ల లాభం..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
జీతం తిరిగివ్వడం సరికాదు..ప్రిన్సిపల్
1970లో స్వాతంత్ర్య సమరయోధుడు నితీశేశ్వర్ ప్రసాద్ సింగ్ చేత స్థాపించబడిన నితీశేశ్వర్ కళాశాల 1976 నుంచి (BRABU)తో అనుబంధంగా ఉంది. ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. లలన్ కుమార్ జీతం తిరిగి ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ ప్రశ్నించారు. ‘ఇక్కడ ప్రశ్న కేవలం హాజరుకాని విద్యార్థుల గురించి కాదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగానికి బదిలీ కావాలనే ఒత్తిడి వ్యూహం’ అని ఆయన అన్నారు. ఇంతలో, BRABU రిజిస్ట్రార్ ఆర్కే ఠాకూర్ ఈ చర్యను అభినందించారు. లాలన్ కుమార్ చేసినది చాలా అసాధారణమైనదని ఆయన అన్నారు. ఈ విషయమై వైస్ ఛాన్సలర్‌తో చర్చిస్తున్నామని, గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని నితీశేశ్వర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను త్వరలో కోరతామన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..