అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అట్లీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది, కానీ ఎందుకో ఏమో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్నా అట్లీ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు మరెవరో కాదు, మలయాళంలో ఇప్పటికే హీరోగా, దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన బాసిల్ జోసెఫ్ అని అంటున్నారు.
Also Read:Air India plane crash: విమానం టేకాఫ్ వెనక ఉన్న సైన్స్ ఇదే.. విమాన గతిని నియంత్రించే 4 శక్తులు..
ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. మిన్నల్ మురళి లాంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు, అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు బాసిల్ జోసెఫ్. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా పట్టాలెక్కబోతోంది అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు.