Site icon NTV Telugu

Amit Shah: సీఎం జగన్‌పై అమిత్‌షా హాట్‌ కామెంట్లు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు

Amith

Amith

Amit Shah: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సీఎం వైఎస్‌ జగన్‌, వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సభలో పాల్గొన్న ఆయన.. మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మంధిర ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్, రాహుల్ గాంధీకీ ఆహ్వానం పంపినా రాలేదని దుయ్యబట్టారు. ఇక, సీఎం జగన్ ఏపీని అభివృద్ధిని చేయకుండా భ్రష్టు పట్టించారని.. ఏపీ ప్రజలపై 13 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు.. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్.. మద్యం సిండికేట్ లు ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సీఎం జగన్ ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి.. రాయలసీమ ప్రాజెక్టులు గాలికి వదిలేశారన్నారు.. మరోవైపు, తెలంగాణలో కూడా కమలం వికసిస్తుంది.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును ముఖ్యమంత్రిని.. కేంద్రంలో ప్రధాన మోడీని ప్రధానమంత్రి చేయండి అని పిలుపునిచ్చారు.

Read Also: Monditoka Jaganmohan Rao: నందిగామ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రత్యేక మేనిఫెస్టో

ఇక, నాకు అత్యంత సన్నిహితుడు సత్యకుమార్ ను ధర్మవరంలో గెలిపించండి అని కోరారు అమిత్‌ షా.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోడీ చూసుకుంటారని హామీ ఇచ్చారు. ఏపీలో అవినీతి, అక్రమాలు, మాఫియాలు, మత మార్పిడులకు పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు తెలపడానికి వచ్చాను.. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో అసెంబ్లీకి, లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటివరకు జరిగిన రెండు ఫేజ్ ల ఎన్నికల్లో బీజేపీ 100 లోక్‌సభ సీట్లు గెలవబోతున్నాం అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్‌ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు..

Read Also: Virat Kohli: నీ అంత క్రికెట్ ఆడలేదు.. కోహ్లీపై ఫైర్ అయిన టీమిండియా దిగ్గజం!

మరోవైపు.. తెలుగు భాషను అంతమొందించేందుకే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని విమర్శించారు అమిత్ షా.. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను ఎవరు ఏమి చేయలేరన్న ఆయన.. పోలవరం ఏపీకి జీవనాడి.. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు? అని నిలదీశారు.. శరత్ పవర్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ థాక్రే.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా చెప్పాలి? అని డిమాండ్‌ చేశారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేడు అంటూ ఎద్దేవా చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా..

Exit mobile version