Amit Shah: అయోధ్య రామమందిరం సనాతన సంస్కృతికి అపూర్వ చిహ్నంగా నిలిచిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోట్లాది మంది రామభక్తులకు మరపురాని రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో తరాలు ఎదురుచూశాయని, అయితే రామజన్మభూమిలో మళ్లీ ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని, నమ్మకాన్ని ఏవీ వమ్ము చేయలేదని షా అన్నారు. మరోవైపు.. రామమందిరం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులు అర్పించారని తెలిపారు. వారు ఎన్నో అవమానాలు, చిత్రహింసలు ఎదుర్కొన్నారని అయితే మత మార్గాన్ని వీడలేదని షా అన్నారు.
Read Also: Hyderbad Metro : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కొత్త రూట్ల ఖరారు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
విశ్వ హిందూ పరిషత్, వేలాది మంది మహానుభావులు, ఎంతో మంది వ్యక్తుల పోరాటం ఈ రోజు సంతోషకరమైన విజయవంతమైన ఫలితాన్ని ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. అయోధ్యలో శ్రీ రామజన్మభూమి దేవాలయం సనాతన సంస్కృతికి అపూర్వ చిహ్నంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రామ మందిరాన్ని నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి షా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. అయోధ్యలో ఈరోజు జరిగిన ఈ మహోత్సవానికి అమిత్ షా వెళ్లలేదు. కాగా ఆయన ఢిల్లీలోని బిర్లా టెంపుల్‌లో ఇతర పార్టీ నేతలతో కలిసి ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని షా వీక్షించారు.
जय श्री राम…
5 सदी की प्रतीक्षा और प्रतिज्ञा आज पूर्ण हुई।🙏
आज का दिन करोड़ों रामभक्तों के लिये कभी ना भूलने वाला दिन है। आज जब हमारे रामलला अपने भव्य मंदिर में विराजमान हुए हैं, तब असंख्य रामभक्तों की तरह मैं भी भावविभोर हूँ। इस भावना को शब्दों में समेट पाना संभव नहीं है।… pic.twitter.com/uJIuh2F7ek
— Amit Shah (@AmitShah) January 22, 2024
Read Also: Karimangar :కాషాయమయమైన కరీంనగర్ తెలంగాణ చౌరస్తా
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రారంభమైన ప్రాణప్రతిష్ఠ క్రతువు.. ప్రధాని మోడీ బాలరాముడి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదకలు సమర్పించారు. రామ్‌లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. 12: 29: 03 నుంచి 12: 30: 35 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కొనసాగింది. గణేశ్వర శాస్త్రీ ద్రావిడ నేతృత్వంలో మహాగంభీరంగా క్రతువు జరిగింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!